250 రోజుల దూరంలో ఆర్ ఆర్ ఆర్

Published on Nov 24,2019 06:30 PM

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదల కావడానికి 250 రోజుల దూరంలో ఉంది. మరో 250 రోజుల తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదల కానుంది. దాంతో మరో 250 రోజుల దూరంలో అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , రాంచరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. 2020 జూలై 30 న విడుదల చేయనున్నట్లు ప్రారంభంలోనే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి  ప్రకటించిన విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. ఇక అలియా భట్ చరణ్ సరసన నటిస్తుండగా ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటించనుంది. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషలలో విడుదల అవుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై స్కై లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి.