రాజమౌళి ఏ ప్రకటన చేస్తాడో ?

Published on Mar 13,2019 03:13 PM

రేపు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు . రాజమౌళి తో పాటుగా ఎన్టీఆర్ , రాంచరణ్ అలాగే సినిమాకు సంబందించిన ప్రముఖులు పాల్గొననున్నారు . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది ఇప్పటికే . ఎన్టీఆర్ - చరణ్ ల లాంటి మాస్ హీరోల వల్ల అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి . 

రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు జక్కన్న . అక్కడ ఏ ప్రకటన చేయనున్నాడో ? అలాగే సినిమాకు సంబందించిన విశేషాలను వెల్లడిస్తాడా ? చూడాలి . ఎందుకంటే కథ విషయంలో రకరకాల కథనాలు వస్తున్నాయి మరి . అలాగే హీరోయిన్ ల ప్రస్తావన కూడా రావచ్చు . ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రెండు హెడ్యూల్ లను పూర్తిచేసుకుంది .