ట్రెండింగ్ లో ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్

Published on Mar 28,2020 04:10 PM
ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా విడుదల అయ్యింది. ఆ మోషన్ పోస్టర్ అలా విడుదల అవ్వడమే ఆలస్యం ట్రెండింగ్ లోకి వెళ్ళింది. సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అసలే ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆపై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది.

ఇక మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ , చరణ్ లను రాజమౌళి చూపించిన విధానం నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ కి ఫుల్ ఫామ్ ఇచ్చాడు జక్కన్న. ఇంతకీ ఆర్ ఆర్ ఆర్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా ....... రౌద్రం , రణం , రుధిరం. ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి గెటప్ పూర్తిగా రివీల్ కాలేదు కానీ ఈ స్లో మోషన్ పోస్టర్ కేక అని చెప్పొచ్చు. పండగ రోజున మంచి విందు అందించాడు జక్కన్న.