ఆర్ ఆర్ ఆర్ కు సంచలన ఆఫర్

Published on Jan 22,2019 05:32 PM

ఎన్టీఆర్ , రాంచరణ్ లు నటిస్తున్న సంచలన చిత్రానికి కళ్ళు చెదిరిపోయే ఆఫర్ లభించింది . ఈ సినిమా శాటిలైట్ హక్కులు అన్ని భాషలు కలుపుకొని 150 కోట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారట ప్రముఖ ఛానల్ జీ తెలుగు వాళ్ళు . ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర బాషలలో కూడా జీ ఉన్న విషయం తెలిసిందే . దాంతో గుండు గుత్తగా ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చారట అయితే నిర్మాత దానయ్య మాత్రం టెంప్ట్ అవ్వకుండా మాట్లాడదామని వాళ్ళని లైన్ లో పెట్టాడట . 

ఆర్ ఆర్ ఆర్ చిత్రం కేవలం ప్రారంభమైంది అంతే ! మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తిచేసుకుంది . ప్రస్తుతం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది . ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు కావడం ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలు కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది . ప్రస్తుతం యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు రాజమౌళి .