ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా

Published on Mar 14,2019 04:11 PM

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్  ''. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా పెట్టిన దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేశామని స్పష్టం చేసాడు రాజమౌళి . ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ గా టైటిల్ ని ఫిక్స్ చేశామని చెప్పడమే కాకుండా పలు సంచలన విషయాలను వెల్లడించాడు . 

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించాడు జక్కన్న అలాగే నిర్మాత దానయ్య . జులై 30 న 2020 లో రిలీజ్ కాబోతోంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం . ఎన్టీఆర్- రాంచరణ్ లు నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ , అజయ్ దేవ్ గన్ , సముద్రఖని తదితరులు నటించనున్నారు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు . ఈ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ , చరణ్ , రాజమౌళి లతో పాటుగా డీవీవీ దానయ్య కూడా పాల్గొన్నాడు .