సీడెడ్ రైట్స్ లో ప్రభంజనం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్

Published on Mar 04,2020 04:09 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం పై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ కూడా పూర్తికాకుండానే ఈ సినిమా హక్కుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు ఏరియాలలో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగగా తాజాగా సీడెడ్ లో అయితే ప్రభంజనమే సృష్టించింది ఆర్ ఆర్ ఆర్. ఇంతకీ సీడెడ్ లో ఆర్ ఆర్ ఆర్ కు పలికిన ధర ఎంతో తెలుసా ........ 35 కోట్లు.

అవును అక్షరాలా 35 కోట్లు పలికిందట. ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు కూడా మాస్ హీరోలు అందునా వాళ్లకు రాజమౌళి తోడు అవుతుండటంతో ఈ భారీ రేటు పలికిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 2021 జనవరి 8 న ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.