ఆర్ ఆర్ ఆర్ కు కరోనా కష్టాలు !

Published on Mar 30,2020 11:48 PM
కరోనా కష్టాలు ఇప్పట్లో అయిపోయేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంది అయితే దాన్ని ఆ తర్వాత పొడిగిస్తారా ? లేదా ? అన్నది తెలియదు. ఆ విషయం పక్కన పెడితే ఒకవేళ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ షూటింగ్ లకు మాత్రం ఇబ్బంది తప్పాపోవచ్చని అంటున్నారు. పైగా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికే పడనుంది. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎక్కువగా భారీ సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాల్లో వందల కొద్దీ జూనియర్ ఆర్టిస్టు లను పెట్టాల్సి వస్తుంది.

కరోనా భయంతో వణికిపోతున్న వాళ్లంతా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో క్రౌడ్ సీన్స్ లో నటించడం అంటే లైఫ్ రిస్క్ చేయడమే! మరి అలాంటి సన్నివేశాల్లో వాళ్ళు నటిస్తారా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ జక్కన్న అందుకు సిద్ధమైనా హీరోలు అందుకు ఒప్పుకుంటారా చూడాలి. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో చిత్ర పరిశ్రమకు పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి.