రెగ్యులర్ షూటింగ్‌లో ‘రోమియో జూలియట్‌’

Published on Aug 24,2019 11:03 AM
ప్రముఖ దర్శకుడు భరత్‌ పి. తనయుడు ధనుష్‌ని  హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రోమియో జూలియట్‌’.   హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.   ఈ సందర్భంగా దర్శక నిర్మాత భరత్‌ పి. మాట్లాడుతూ...‘‘మా అబ్బాయి ధనుష్‌ ని హీరోగా పరిచయం చేస్తూ ‘రోమియో జూలియట్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. మా అబ్బాయి ధనుష్‌ యాక్టింగ్‌, డాన్స్‌, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. స్వచ్ఛమైన ప్రేమకథా  చిత్రంగా `రోమియో జూలియట్ ` చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్‌లో ని ఒక ఫేమస్  కాలేజ్‌లో షూటింగ్‌ చేస్తున్నాం. ఒక పాటతో పాటు కొన్ని సీన్స్‌ చిత్రీకరించాం. ఇక కంటిన్యూగా షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. ధనుష్‌ అనుకున్న దానికన్నా చాలా బాగా నటిస్తున్నాడు. ఈ సినిమా మా ఇద్దరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు.

ఈ చిత్రంలో  హర్ష, శ్రీధర్‌ రాజు, గోపాల్‌, మధుభాయ్‌, కళాధర్‌, వెంకట్‌, మధన్‌ యాదవ్‌, స్వరూప్‌, ఆశన్న, మేక రామకృష్ణ, కావ్యకీర్తి, సరిత రెడ్డి, రాజా, జ్యోతిర్మయి తదితరులు  నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రఘు.ఆర్‌.బళ్లారి,  సంగీతం: ఎమ్‌యల్‌ రాజా, పాటలు : కు లశేఖర్‌, పెద్దాడమూర్తి,  కొరియోగ్రఫీ: విద్యాసాగర్‌,  ఫైట్స్‌: కృష్ణంరాజు, ఆర్ట్‌: వెంకట్‌,  ఎడిటర్‌: మేనగ శ్రీను,  మాటలు:  మరుధూరిరాజా, కథ-స్క్రీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: భరత్‌ పి