గోవాలో రొమాంటిక్

Published on Nov 12,2019 10:40 PM

పూరి జగన్నాధ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా రూపొందుతున్న చిత్రం '' రొమాంటిక్ ''. ఆకాష్ సరసన కేతికా శర్మ నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. పలు రొమాంటిక్ సన్నివేశాలతో పాటుగా యాక్షన్ సీన్స్ కూడా అక్కడ చిత్రీకరించనున్నారట. ఇక ఈ షెడ్యూల్ ఎన్ని రోజులో తెలుసా ...... ఏకంగా 30 రోజుల పాటు గోవాలో షూటింగ్ జరుపుకోనుంది.

ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ ఫస్ట్ లుక్ కేక పెట్టిస్తోంది. హీరో హీరోయిన్ లు ఇద్దరు కూడా నగ్నంగా గట్టిగా కౌగిలించుకున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని ఈ స్టిల్ చాటి చెబుతోంది తాజాగా గోవా లో ఏకంగా 30 రోజుల షెడ్యూల్ అంటేనే అర్ధం అవుతోంది కదా ! ఆకాష్ హీరోగా పరిచయమై రెండు చిత్రాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు ఇప్పుడు ఈ రొమాంటిక్ సినిమాతో హిట్ కొట్టే లాగే ఉన్నాడు.