మోహన్ బాబు ఇంట్లో చోరీ

Published on Feb 23,2019 02:46 PM

విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది . హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది . పెద్ద మొత్తంలో నగదు అలాగే బంగారు ఆభరణాలు పోయాయని మోహన్ బాబు మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు . అయితే ఈ దొంగతనం పని మనిషి మీద అనుమానం  ఉండటంతో ఆ అనుమానం వ్యక్తం చేసారు . 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఇంతకుముందు కూడా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో చోరీలు జరిగాయి , ఆ చోరీలలో ఎక్కువగా ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావడం గమనార్హం . మోహన్ బాబు కు ఫిలిం నగర్ లో ఇల్లు ఉంది కానీ ఇక్కడ ఉండకుండా శంషాబాద్ లో ఉంటున్నాడు . ఇక్కడ మంచు లక్ష్మి ఉంటోంది .