రజనీకాంత్ పై విమర్శలు చేసిన ఆర్కే సెల్వమణి

Published on Feb 11,2020 02:51 PM

దర్శకులు ఆర్కే సెల్వమణి సూపర్ స్టార్ రజనీకాంత్ పై విమర్శలు చేసాడు. దర్బార్ చిత్రాన్ని కొన్న బయ్యర్లు నష్టపోయామంటూ దర్శకులు మురుగదాస్ ఇంటిని , ఆఫీసుని చుట్టుముట్టడం ఏంటి ? నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటి ? ఇది ముమ్మాటికీ రజనీకాంత్ చేసిన తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి. గతంలో రజనీకాంత్ సినిమాలు ప్లాప్ అయితే బయ్యర్లకు నష్టపరిహారం ఇచ్చాడని , ఇప్పుడు దాన్ని అలుసుగా తీసుకొని మురుగదాస్ వెంట పడుతున్నారని అతడికి దర్శకుల సంఘం అండగా ఉంటుందని అంటున్నాడు సెల్వమణి.

రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినప్పటికీ బయ్యర్లకు ఎక్కువ సొమ్ముకు అమ్మడంతో కొంతమందికి నష్టాలు వచ్చాయి. అలాగే రజనీకాంత్ , మురుగదాస్ ల రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో కూడా ఈ పరిస్థితి వచ్చింది. దాంతో బయ్యర్లు అటు రజనీకాంత్ ఇంటి చుట్టూ ఇటు మురుగదాస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.