బాలీవుడ్ లో విషాదం : రిషికపూర్ మృతి

Published on Apr 30,2020 04:48 PM

బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ సీనియర్ హీరో రిషికపూర్ ఈరోజు ముంబై లో కన్నుమూశారు. అనారోగ్యంతో నిన్న ముంబై లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రిషికపూర్ (67) ఈరోజు ఉదయం మరణించాడు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు రిషికపూర్. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నాడు ఈ నటుడు. అయితే పూర్తిగా కోలుకోలేకపోయాడు. దానికి తోడు శ్వాసకోశ వ్యాధి కూడా తీవ్రతరం కావడంతో తుదిశ్వాస విడిచారు.

70 వ దశకంలో స్టార్ హీరోగా రాణించిన రిషికపూర్ రొమాంటిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ తనయుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్ హీరోగా రాణించాడు. ఇక తాత రాజ్ కపూర్ తండ్రి రిషి కపూర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రణబీర్ కపూర్ తాత , తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రొమాంటిక్ హీరోగా రాణిస్తున్నాడు. రిషి కపూర్ మరణంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రిషికపూర్ మృతికి పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.