అప్పులు తీర్చడానికి హీరోగా మారిన రిషికపూర్

Published on May 02,2020 11:38 AM
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్ తన తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి హీరోగా మారాడు. దర్శక నిర్మాత హీరో రాజ్ కపూర్ తనయుడే ఈ రిషికపూర్. అయితే అప్పట్లో మేరా నామ్ జోకర్ అనే చిత్రాన్ని నిర్మించాడు రాజ్ కపూర్. ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో అప్పుల పాలయ్యాడు రాజ్ కపూర్. దాంతో తన అప్పులను తీర్చాలంటే రొమాంటిక్ ఫిలిం చేయాలనీ భావించి తన కొడుకు రిషి కపూర్ ని హీరోగా పెట్టి '' బాబీ '' అనే సినిమా రూపొందించాడు.

అప్పట్లో బాబీ భారతదేశమంతా ప్రభంజనం సృష్టించింది. మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించిన హీరో అయ్యాడు రిషికపూర్. ఇక బాబీ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు రిషికపూర్ కు. బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా , ధర్మేంద్ర , ల తర్వాత అంతటి రొమాంటిక్ కింగ్ అయ్యాడు రిషికపూర్. కట్ చేస్తే 67 ఏళ్ల వయసులో సెలవు అంటూ సుదూర తీరాలకు వెళిపోయాడు. ఇక ఇప్పుడు రొమాంటిక్ హీరోగా రాణిస్తున్న రణబీర్ కపూర్ రిషి కపూర్ తనయుడే.