సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

Published on Dec 18,2019 09:57 PM

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఎవరబ్బా ? అని అనుకుంటున్నారా ? రానా హీరోగా నటించిన లీడర్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది రిచా గంగోపాధ్యాయ. లీడర్ చిత్రం తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది ఈ భామ అయితే మిరపకాయ్ , మిర్చి చిత్రాలు హిట్ అయినప్పటికీ ఈ భామకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ చదువుల కోసం అమెరికా వెళ్ళింది.

అక్కడ తన ఫ్రెండ్ అయిన జో లాంగెల్లా ని ప్రేమించింది. తనని ప్రేమించిన వాడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. కేవలం తన దగ్గరి మిత్రులను మాత్రమే ఆహ్వానించింది అంతేకాని ఫిలిం ఇండస్ట్రీ నుండి ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు రిచా గంగోపాధ్యాయ. అయితే తన పెళ్లి కి సంబందించిన ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది రిచా గంగోపాధ్యాయ. చదువు పేరుతో సినిమాలను వదిలేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని హాయిగా ఓ ఇంటిదయ్యింది.