పెళ్లి చేసుకోనున్న హీరో హీరోయిన్ లు

Published on Aug 24,2019 11:26 AM

తెలుగులో తూనీగ తూనీగ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ భామ రియా చక్రవర్తి తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది . దాంతో ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు ఈ విషయాన్నీ బట్టబయలు చేసాడు . సుశాంత్ సింగ్ పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడని అయితే రియా వల్లే కాస్త ఆలస్యం అవుతోందని అంటున్నాడు . 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎం ఎస్ ధోని బయోపిక్ తో చాలా ఫేమస్ అయ్యాడు . ఆ సినిమా తర్వాత ఈ హీరో పేరు పలువురు హీరోయిన్ లతో ముడిపెట్టి జోరుగా కథనాలు రాసారు . కట్ చేస్తే ఇప్పుడు రియా చక్రవర్తి తో డేటింగ్ చేస్తున్నాడు . రియా కెరీర్ పరంగా అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయింది కాబట్టి పెళ్లిపీటలు ఎక్కుతుందేమో !