హైకోర్టు ని ఆశ్రయించిన రాంగోపాల్ వర్మ

Published on Nov 28,2019 03:26 PM

కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఇంకా సెన్సార్ కాకపోవడంతో హైకోర్టు ని ఆశ్రయించాడు దర్శకులు రాంగోపాల్ వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని రేపు అంటే నవంబర్ 29 న విడుదల చేయాలనీ అనుకున్నారు వర్మ అయితే ఈ సినిమా టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించాడు కే ఏ పాల్. అలాగే సినిమాలో మమ్మల్ని అవమానించేలా నా క్యారెక్టర్ పెట్టారని ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు కె ఏ పాల్.

టైటిల్ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కమ్మరాజ్యంలో కడప రెడ్లు కు బదులుగా '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' గా టైటిల్ మారుస్తున్నట్లు ప్రకటించాడు వర్మ. అయినా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సెన్సార్ త్వరగా పూర్తిచేయాలని , సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించాలని హైకోర్టు ని ఆశ్రయించాడు వర్మ. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.