రివ్యూ రైటర్ లపై మండిపడుతున్న అలీ

Published on Oct 23,2019 12:31 PM
హాస్య నటుడు అలీ రివ్యూ రైటర్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల అలీ నటించిన రాజుగారి గది 3 విడుదల అయ్యింది అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు దాంతో రివ్యూలు కూడా తీవ్రంగా వచ్చాయి దాంతో తట్టుకోలేకపోయాడు అలీ. బొంగు మీకేం తెలుసు రివ్యూలా గురించి మీరు రాస్తే హిట్టు లేకపోతే ప్లాపా అంటూ రివ్యూ రైటర్ లపై మండిపడుతున్నాడు. అయితే కొంతమంది రివ్యూ రైటర్ లు కొంతవరకు తప్పులు చేస్తున్న మాట నిజమే మరి. అయితే రివ్యూలు బాగుంటే చూసే ప్రేక్షకులు తక్కువే ! రివ్యూల సంగతి ఎలా ఉన్నప్పటికీ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు వినోదం అందితే రివ్యూల గురించి ఆలోచించకుండా విజయవంతం చేస్తారు. కానీ అలీ కి మొదటి నుండి కొంతమంది మీడియా వాళ్ళ మీద తీవ్రమైన కోపం అయితే ఉంది .... ఎందుకో మరి.