మహేష్ కు తల్లిగా రేణు దేశాయ్

Published on May 02,2020 03:34 PM
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తల్లిగా నటించాల్సి వస్తే తప్పకుండా చేస్తానని అంటోంది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాక ఈ ఇద్దరికీ ఇద్దరు సంతానం కలిగారు. అయితే 2013 లో పవన్ కళ్యాణ్ తో తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది రేణు దేశాయ్.

విడాకులు తీసుకున్నాక దర్శక నిర్మాతగా అవతారం ఎత్తింది రేణు. అలాగే మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆశపడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ని మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా ? అంటే తప్పకుండా చేస్తానని , తల్లిగా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి షాక్ ఇచ్చింది. మహేష్ బాబు కంటే 7 ఏళ్ళు చిన్నది రేణు దేశాయ్. ఐతే సినిమాల్లో ఎక్కువ వయసు , తక్కువ వయసు అన్నది ఏమి ఉండదు అవసరాన్ని బట్టి చిన్నవాళ్లు పెద్దవాళ్ళలా , పెద్దవాళ్ళు చిన్న వాళ్ళలా నటించడం కామన్ అయిపొయింది.