ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్న రేణు దేశాయ్

Published on Apr 17,2019 05:40 PM

పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు నేను ఎడిటింగ్ చేశాను కానీ నాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా ఇవ్వలేదు అందుకు సాక్ష్యం పవన్ కల్యాణే అని అంటోంది రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఇటీవల అలీ నిర్వహించిన ఓ షోలో పాల్గొని సంచలన విషయాలను వెల్లడించింది . 

అసలు నా పేరు అంటే నాకు ఇష్టం లేదు , రేణు దేశాయ్ కాకుండా మరో పేరు పెడితే బాగుండేది అని తన పేరు పట్ల అయిష్టతని వ్యక్తం చేసింది . అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రం లోని '' ఏ మేరా జహాఁ '' అనే పాటకు మొత్తం ఎడిటింగ్ చేసింది నేనే అని ఆ పాట మంచి హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు నేను ఎడిటర్ గా వర్క్ చేసానని అయితే ఒక్క సినిమాకు కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు ..... ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ అసలు విషయాన్నీ చెప్పింది . అంతేకాదు తన ఇద్దరు పిల్లలంటే నాకు ప్రాణమంటూ సెలవిచ్చింది .