త్రో బ్యాక్ పిక్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్

Published on Apr 22,2020 10:37 AM
20 ఏళ్ల బద్రి సినిమా కోసం దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ అంటూ పోస్ట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది రేణు దేశాయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది రేణు దేశాయ్. ఆ సినిమాలోని బంగాళాఖాతం అనే బ్లాక్ బస్టర్ సాంగ్ చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లారట చిత్ర బృందం. అక్కడ షూటింగ్ గ్యాప్ లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవంట. పైగా రేణు దేశాయ్ షార్ట్ స్కర్ట్ వేసుకొని ఉంది దాంతో ఆమె కింద కూర్చోలేక ఎక్కువసేపు నిలబడలేక చాలా ఇబ్బంది పడిందట.

అప్పటి ఇబ్బందిని గుర్తుచేసుకుంటూ ఆ సినిమాలోని స్టిల్ ని పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ఆ సినిమా తర్వాతే పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేసారు 2009 లో మాత్రం పవన్ - రేణు పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ దర్శకత్వం చేయాలని , సినిమాలు నిర్మించాలనే ప్లాన్ లో ఉంది.