రేణు దేశాయ్ కి కోపం తెప్పించిన ఫ్యాన్స్

Published on Dec 30,2019 02:22 PM

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి కోపం వచ్చేలా చేసారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ ఏం చేసారో తెలుసా ....... రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకిరా నందన్ , ఆద్య లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది సోషల్ మీడియాలో. దాంతో పవన్ కల్యాణ్ రక్తం అంటూ కామెంట్స్ పెట్టారు పవన్ ఫ్యాన్స్ దాంతో రేణు దేశాయ్ కి విపరీతమైన కోపం వచ్చింది. అంతే మీకు సైన్స్ గురించి ఐడియా లేదనుకుంటా వాళ్లలో ప్రవహిస్తోంది నా రక్తం అంటూ రిప్లయ్ ఇచ్చింది.

రేణు ఇచ్చిన రిప్లయ్ కొంతమంది పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు దాంతో రేణు దేశాయ్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నాలో ఉన్న అమ్మతనాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ పవన్ కల్యాణ్ అభిమానులకు గట్టిగానే సమాధానం చెబుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ వల్లే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండలేకపోతోంది. ఇక ఎప్పుడైనా ఇలా పోస్ట్ లు పెడితే చాలు కొంతమంది ఆమెని వెంటాడుతు ఇబ్బంది పెడుతున్నారు పాపం.