రిలీజ్ కష్టాల్లో ఎన్టీఆర్ మహానాయకుడు

Published on Jan 30,2019 02:20 PM

ఎన్టీఆర్ కథానాయకుడు అట్టర్ ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి టాక్ బాగానే  వచ్చింది అయితే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లేకుండాపోయాయి. దాంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. 

ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో ఖంగుతిన్న చిత్ర బృందం రెండో భాగాన్ని వెంటనే విడుదల చేయడానికి జంకారు . ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో సరిగా లేని సీన్స్ ని రీ షూట్ చేస్తూ , అన్ని సరిగ్గా ఉన్నాయా ? లేదా ? అని చూస్తూ కిందా మీదా పడుతున్నారు. క్రిష్ , బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలన్నీ ఆడియాసలయ్యాయి దాంతో రెండో పార్ట్ రిలీజ్ కష్టాలను ఎదుర్కొంటోంది.