మజిలీ సినిమా రిలీజ్ అవుతుందా ? వాయిదాపడుతుందా ?

Published on Mar 12,2019 04:44 PM

రియల్ లైఫ్ పార్ట్ నర్స్ అయిన అక్కినేని నాగచైతన్య - సమంత లు కలిసి నటించిన చిత్రం '' మజిలీ '' . నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విడుదల సమస్యలు పట్టి పీడిస్తున్నాయి . రిలీజ్ ప్రాబ్లెమ్ అనగానే ఆర్ధిక ఇబ్బందులు అనుకుంటారు కానీ మజిలీ చిత్రానికి వచ్చిన ఇబ్బంది రాజకీయ ఇబ్బంది . అదేనండి ఏప్రిల్ 11 న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ అంటే దానికి వారం , పది రోజుల ముందు నుండి పెద్ద హడావుడి ఉంటుంది మరి . 

దాంతో ఈ సినిమాని రిలీజ్ చేయాలా ? వద్దా ? అనే డైలమాలో పడ్డారు . ఏప్రిల్ 5న విడుదల అని డేట్ ఎప్పుడో ప్రకటించారు . కట్ చేస్తే ఏప్రిల్ 11న ఎన్నికలు అని నోటిఫికేషన్ ఇచ్చారు . దాంతో రిలీజ్ డేట్ మారుద్దామా ? లేక రిలీజ్ చేద్దామా ? అని ఎదురుచూస్తున్నారు . ఇంకా తేలలేదు . కానీ ఏదో ఒకటి డిసైడ్ చేస్తారట.