రిలీజ్ సమస్యల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్

Published on Mar 13,2019 11:55 AM

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ సమస్యల్లో చిక్కుకుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ప్రతి నాయకుడిగా చిత్రీకరించారు కాబట్టి ఆ సినిమాని ఎన్నికలు అయిపోయేంత వరకు రిలీజ్ కాకుండా ఆపేయాలని ఎన్నికల సంఘం ని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 

ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకవేళ ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ పై నిషేధం విధిస్తే యూట్యూబ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.