90 ఎం ఎల్ రిలీజ్ డేట్ మారింది

Published on Dec 05,2019 08:09 PM

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన 90 ఎం ఎల్ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండే కానీ సెన్సార్ సమస్యల్లో ఆ చిత్రం చిక్కుకోవడం వల్ల అనుకున్న సమయానికి అంటే ఈరోజు విడుదల కావడం లేదు కాకపోతే సినిమా విడుదల ఆగిపోవడం లేదు కాబట్టి ఒకరోజు ఆలస్యంగా అంటే డిసెంబర్ 6 న విడుదల అవుతోంది. సెన్సార్ సమస్యలను అధిగమించి రేపు విడుదల చేస్తున్నారు.

90 ఎం ఎల్ పుచ్చుకోక పొతే చచ్చిపోయే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ హీరో ఆ తర్వాత నటించిన చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి దాంతో మళ్ళీ తన సొంత బ్యానర్ లో ఈ చిత్రం చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై కార్తికేయ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. అయితే అతడి ఆశలు నెరవేరుతాయా ? లేదా ? అన్నది రేపు తేలిపోనుంది.