తమిళ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ మారింది

Published on Sep 03,2019 12:06 PM

తెలుగునాట సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా ప్రభంజనం సృష్టించింది. ఇక ఇప్పుడేమో తమిళ్ లో ఆదిత్య వర్మ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ రిలీజ్ డేట్ మారింది, కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసా ....... నవంబర్ 8. 
తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఆదిత్య వర్మ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ తమిళ అర్జున్ రెడ్డి పలు వివాదాలను ఎదుర్కొంటోంది. పలు ఇబ్బందులతో సతమతం అవుతోంది. ఈ సినిమాకు మొదట ప్రముఖ సీనియర్ దర్శకులు బాల దర్శకత్వం వహించగా అతడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాగా రాలేదనే సాకుతో మళ్ళీ రీ షూట్ చేసారు గిరీశాయ దర్శకత్వంలో. మొత్తానికి అన్ని ఇబ్బందులు అధిగమించిందంటే ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది నవంబర్ 8 కి.