హాట్ రోల్స్ కావాలంటున్న రెజీనా !

Published on Apr 15,2020 05:06 PM
హాట్ భామ రెజీనా కాసాండ్రా తనకు హాట్ రోల్స్ కావాలని అడుగుతోంది. ఈ భామ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 15 ఏళ్ళు కావస్తోంది. ఈ 15 సంవత్సరాలలో తెలుగు , తమిళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. అయితే ఈ భామ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అలాగే హిట్ చిత్రాలలో నటించినప్పటికీ పాపం అవి రెజీనా కు అంతగా ఉపయోగపడలేదు. అయితే ఎవరు సినిమాలో ఈ భామ రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.

ఎవరు చిత్రంలో చాలా బోల్డ్ గా నటించి మంచి పేరు కొట్టేసిన రెజీనా తనకు అలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఇవ్వండి అని దర్శక నిర్మాతలను కోరుతోంది రెజీనా కాసాండ్రా. ఈ బ్లాక్ బ్యూటీ తాను ఆశించిన స్టార్ డం ని పొందకపోవడంతో ఆమధ్య నిరాశ నిస్పృహలకు లోనయ్యింది అయితే ఎవరు సక్సెస్ తర్వాత మంచి జోష్ వచ్చింది రెజీనా కాసాండ్రాలో.