రామ్ సినిమా ఇక్కడ ప్లాప్ అక్కడ హిట్

Published on Feb 06,2019 05:43 PM

రామ్ హీరోగా నటించిన '' ఉన్నది ఒకటే జిందగీ '' టాలీవుడ్ లో ప్లాప్ అయ్యింది . అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేస్తే మాత్రం యూట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యింది . ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని హిందీలో '' నెం. 1 దిల్ వాలా '' గా డబ్ చేసారు. ఇక ఈ సినిమాని మూడు రోజుల క్రితమే యూట్యూబ్ లో పెట్టారు . ఇలా యూట్యూబ్ లో పెట్టడమే ఆలస్యం చక చకా వ్యూస్ వచ్చేసాయి . 

కట్ చేస్తే మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ వచ్చాయి దాంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉన్నారు . తెలుగులో ప్లాప్ అయినప్పటికీ హిందీలో రికార్డ్ స్థాయి వ్యూస్ వస్తుండటం వాళ్ళని సంతోషంలో ముంచెత్తింది . రామ్ , అనుపమ పరమేశ్వరన్ , శ్రీ విష్ణు , లావణ్య త్రిపాఠీ నటించిన ఈ చిత్రానికి  కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు .