లిప్ లాక్ లతో రాయలసీమ లవ్ స్టోరీ

Published on Sep 28,2019 10:13 AM

ఈరోజు విడుదలైన రాయలసీమ లవ్ స్టోరీ చిత్రంలో లిప్ లాక్ లకు కొదవే లేదు అని చెప్పాలి. వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి రామ్ రణధీర్ దర్శకత్వం వహించాడు. పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ సాయి ఏలేందర్ అందించిన పాటలు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ లకు అయితే కొదవే లేదు.
వెంకట్ - హృశాలి ల మధ్య లిప్ లాక్ లు యువత ని పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఈరోజుల్లో అడల్ట్ కంటెంట్ తో వచ్చే చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో ఈ సినిమాకు కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నారు ఆ చిత్ర బృందం. పలువురు నటీనటులు నటించిన రాయలసీమ లవ్ స్టోరీ మొత్తానికి యూత్ కి నచ్చేలా ఉందని , పైసా వసూల్ చిత్రమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.