రాయలసీమ లవ్ స్టోరీ యమా హాట్ గురూ !

Published on Aug 26,2019 12:05 PM

వెంకట్ , హృశాలి , పావని నాయికా నాయికలుగా రామ్ రణధీర్ దర్శకత్వంలో పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన చిత్రం '' రాయలసీమ లవ్ స్టోరీ'' . లవ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. దాంతో రేపు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు అలాగే సెప్టెంబర్ 20 న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించగా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఇక ఇప్పుడేమో ట్రైలర్ రాబోతోంది ఈ ట్రైలర్ యమా హాట్ గురూ అనిపించేలా ఉంది. శృంగార సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకుంటాయని అలాగే మంచి యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందని పాటలు చాలా బాగా వచ్చాయని సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకుడు రామ్ రణధీర్.