రాయలసీమ లవ్ స్టోరీ తో హిట్ కొట్టబోతున్నామన్న పంచలింగాల బ్రదర్స్

Published on Sep 07,2019 02:26 PM

వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లుగా ఏ 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ దర్శకత్వంలో పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా , నాగరాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''రాయలసీమ లవ్ స్టోరీ''. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సూపర్ హిట్ కొట్టబోతున్నామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పంచలింగాల బ్రదర్స్.
రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో చిత్ర నిర్మాత రాయల్ చిన్నా మాట్లాడుతూ " దర్శకుడు రామ్ రణధీర్ చెప్పిన కథ మాకు నచ్చడంతో మరో మాట లేకుండా ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాం. మొదట రాయలసీమ లవ్ స్టోరీ అనే టైటిల్ మమ్మల్ని బాగా ఎట్రాక్ట్ చేసింది , అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ రణధీర్ లో కసి ఉంది. అతడు కథ చెప్పినట్లుగానే సినిమాని బాగా తెరెకెక్కించాడు ..... రాయలసీమ లవ్ స్టోరీ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది , తప్పకుండా మా సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.