రాయలసీమ లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అంటున్న చిత్ర బృందం

Published on Sep 08,2019 09:39 AM
ఏ 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ బ్యానర్ పై రామ్ రణధీర్ దర్శకత్వంలో పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా , నాగరాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాయలసీమ లవ్ స్టోరీ. సెప్టెంబర్ 11 న ఆడియో వేడుక ,సెప్టెంబర్ 27 న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం తమ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతోంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ లవ్ స్టోరీ గురించి వారి వారి మాటల్లోనే  ......
హీరో వెంకట్ మాట్లాడుతూ " దర్శకులు రామ్ రణధీర్ , నిర్మాతలు రాయల్ చిన్నా , నాగరాజు గార్లు నాకు ఈ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. మంచి హీరోయిజం ఉన్న పాత్రతో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
హీరోయిన్ హృశాలి మాట్లాడుతూ " డైరెక్టర్ రామ్ రణధీర్ గారు కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉందే అని అనుకున్నాను, ఒక మంచి చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఈ సినిమా తప్పకుండా నా కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు.
మరో హీరోయిన్ పావని మాట్లాడుతూ " రాయలసీమ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి అయితే వాటికి భిన్నమైన కథ ఈ రాయలసీమ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో నేను కూడా ఒక హీరోయిన్ గా నటిస్తున్నాను, రాయలసీమ అమ్మాయి ప్రేమిస్తే ఎంతవరకు వెళుతుందో చాటి చెప్పే గొప్ప పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా థాంక్స్.
సంగీత దర్శకుడు శ్రీ సాయి యేలేందర్ మాట్లాడుతూ " రాయలసీమ లవ్ స్టోరీ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి, ఆరు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడు చెప్పిన కథ తో ఈ ఆరు పాటలకు అద్భుతమైన బాణీలు కుదిరాయి. యూత్ ని విపరీతంగా అలరించే మంచి సంగీతం కుదిరింది . పాటలు మాత్రమే కాదు నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలవడం ఖాయమన్నారు.
ఛాయాగ్రాహకులు రామ్ మహేందర్ మాట్లాడుతూ " సినిమా ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి, సినిమా బాగా రావడానికి నావంతు కృషి నేను చేసానని ...... రేపు సినిమా విడుదలయ్యాక విజువల్స్ పరంగా కూడా మంచి పేరొస్తుందని ధీమా వ్యక్తం చేసాడు.
ప్రొడక్షన్ డిజైనర్ ఎస్ వలి మాట్లాడుతూ " రామ్ రణధీర్ మంచి కథని రెడీ చేసుకొని నిర్మాతల కోసం చూస్తున్న సమయంలో ఇలాంటి కథకు , రామ్ రణధీర్ లోని ఫైర్ కు తప్పకుండా సహాయం చేయాలనే ఆలోచనతో నాకు తెలిసిన పంచలింగాల బ్రదర్స్ ని పరిచయం చేయడమే కాకుండా అన్ని విషయాలు దగ్గరుండి మరీ చూసుకున్నాను. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ క్వాలిటీ చూపించాం. సినిమా బాగా వచ్చింది తప్పకుండా హిట్ కొట్టబోతున్నామన్న నమ్మకం ఉందన్నారు.
ఎడిటర్ వినోద్ అద్వై మాట్లాడుతూ " సినిమా బాగా వచ్చింది , ఎక్కడా బోరింగ్ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్ తో సాగుతుంది దాంతో సినిమాలో కూడా ఎక్కడా ఆ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను , యంగ్ డైరెక్టర్ రామ్ రణధీర్ కు మంచి విజన్ ఉంది తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడన్న నమ్మకం ఉందన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ " మినిమం బడ్జెట్ లోనే చాలా రిచ్ గా ఉండేలా సినిమా ప్లాన్ చేసాం, ఆర్ట్ డైరెక్టర్ గా నాకు సవాల్ లాంటిదే ఈ సినిమా. లొకేషన్ లలో ఎక్కడ కూడా రాజీ పడకుండా విజువల్ గా బాగుండేలా తీయగలిగాం అందుకు డైరెక్టర్ ని అభినందించక తప్పదు.