జ‌న‌వ‌రి 26న‌ రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి చిత్రం టైటిల్ లోగో లాంఛ్

Published on Jan 24,2019 04:22 PM

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూత‌న చిత్రం మొద‌లుపెట్ట‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే, ర‌వితేజ పుట్టిన రోజు సందర్భంగా‌ ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంఛ్ చేయనున్నారు. ర‌వితేజ‌కు జోడిగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించ‌బోతున్నట్లుగా నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : సాయి శ్రీరామ్

మ్యూజిక్ : థ‌మన్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

పీఆర్ఓ : ఏలూరు శ్రీను 

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ‌పుత్, బాబీ‌సింహా, వెన్నెల కిషోర్, స‌త్య త‌‌దిత‌రులు