రవితేజ కొత్త సినిమా రిలీజ్ డేట్ తెలుసా .. మే 8 న.

Published on Jan 26,2020 04:25 PM

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా క్రాక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు రవితేజ పుట్టినరోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రాక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇక ఆ పోస్టర్ లోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. ఇంతకీ రవితేజ క్రాక్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ....... మే 8 న.

అవును క్రాక్ చిత్రాన్ని మే 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇంతకుముందు గోపీచంద్ మలినేని - రవితేజ ల కాంబినేషన్ లో వచ్చిన '' బలుపు '' , డాన్ శీను చిత్రాలు వచ్చాయి. ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటుగా మరో హాట్ భామ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తోంది. రవితేజ - శృతి హాసన్ లది హిట్ జోడీ కావడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే  అంశమే అని చెప్పాలి.