రవితేజ క్రాక్ టీజర్ రివ్యూ

Published on Feb 22,2020 10:37 PM

మాస మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ టీజర్ నిన్న సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేసిన క్రాక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ టీజర్ తో రవితేజ తప్పకుండా సూపర్ హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. క్రాక్ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. రవితేజ - గోపీచంద్ మలినేని లు కలిసి చేసిన డాన్ శీను , బలుపు రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు క్రాక్ తో.

నెల్లూరు నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రవితేజ నటించగా రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ నటించింది. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందడంతో క్రాక్ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. మండువేసవిలో మే 8 న క్రాక్ చిత్రం రిలీజ్ చేయనున్నారు. టీజర్ బాగానే ఉంది కాబట్టి సినిమా కూడా బాగానే ఉండొచ్చు. గతకొంత కాలంగా రవితేజ వరుస ప్లాప్ లతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఈ క్రాక్ ఏం చేస్తుందో చూడాలి.