బయ్యర్లను ముంచిన రవితేజ

Published on Jan 31,2020 05:51 PM

డిస్కో రాజా చిత్రాన్ని కొన్న బయ్యర్లు నిలువునా మునిగిపోయారు దాంతో లబో దిబో మంటున్నారు. రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రం ఈనెల 24 న విడుదలైన విషయం తెలిసిందే. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించాడు. జనవరి 24 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏడున్నర కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో కలుపుకొని 20 కోట్లకు అమ్ముడుపోయింది థియేట్రికల్ రైట్స్.

శాటిలైట్ , డిజిటల్ , హిందీ డబ్బింగ్ కలుపుకొని నిర్మాత సేఫ్ అయ్యాడు కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం 13 కోట్ల మేరకు నష్టపోయారు. రవితేజ నటించిన నేల టికెట్ చిత్రానికి కూడా ఈ రామ్ తాళ్లూరి నిర్మాత కావడం విశేషం. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో డిస్కో రాజా చేసే అవకాశం ఇచ్చాడు కానీ ఇది కూడా దారుణమైన పరాజయం పాలయ్యింది. దాదాపు 13 కోట్ల నష్టం వాటిల్లింది బయ్యర్లకు. రవితేజ నటించిన పలు చిత్రాలు ఘోర పరాజయం పొందుతున్నాయి దాంతో రవితేజ మార్కెట్ దారుణంగా పడిపోతోంది.