సారీ చెప్పిన రవీనా టాండన్

Published on Dec 30,2019 02:31 PM

హాట్ భామ రవీనా టాండన్ సారీ చెప్పింది. నేను ఏ మతాన్ని కూడా కించపరిచేలా మాట్లాడలేదు , ఒకవేళ అలా మాట్లాడానని ఎవరైనా భావిస్తే అందుకు క్షమాపణ చెబుతున్నానని స్పష్టం చేసింది రవీనా టాండన్. అయితే ఓ షోలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతున్న సమయంలో అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణం అయ్యాయి. దాంతో క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని రవీనా టాండన్ తో పాటుగా ఫరా ఖాన్ , భారతి సింగ్ లపై సోను జాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

సోను ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు రవీనా టాండన్ తో పాటుగా మిగతా ఇద్దరి పై కేసు నమోదు చేసారు. తమపై కేసు నమోదు అయ్యిందన్న విషయం తెలుసుకున్న రవీనా టాండన్ మీడియా ముందు సారీ చెప్పింది. పైగా మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా అంటోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ తెలుగులో మూడు చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు , రథసారథి , పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది రవీనా టాండన్.