రవితేజ ఆ సినిమా చేయనని చెప్పాడట

Published on Sep 08,2019 10:04 AM
హీరో రవితేజ తన సినిమాలో నటించడం లేదని తేల్చి చెప్పాడు దర్శకుడు అజయ్ భూపతి. వైజాగ్ నేపథ్యంలో మహాసముద్రం అనే చిత్రాన్ని చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకులు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత మహాసముద్రం చేయాలనే ఆలోచన చేసాడు ఈ దర్శకుడు, అయితే రవితేజ ఇన్నాళ్లు చేస్తానని చెప్పి తీరా సమయానికి హ్యాండ్ ఇవ్వడంతో చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు అజయ్ భూపతి.
కట్ చేస్తే రవితేజ తో సినిమాలేదు , మరో హీరోని వెతికే పనిలో ఉన్నాను అని అంటున్నాడు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా అజయ్ భూపతి రెండో సినిమా పట్టాలెక్కించడానికి చాలా కష్టాలు పడుతున్నాడు పాపం. ఇక ఈ సినిమాని నాగచైతన్య చేస్తానని అన్నాడట మరి.