బూతు చిత్రం కిస్ టీజర్ విడుదల

Published on Jan 03,2020 04:23 PM
తెలుగులో అడల్ట్ చిత్రాల జోరు ఎక్కువ అవుతోంది , గతకొంత కాలంగా ఈ బూతు చిత్రాలు మరీ ఎక్కువయ్యాయి. ఆ కోవలోనే కిస్ అనే చిత్రం వస్తోంది. తాజాగా కిస్ చిత్ర టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో శృంగార సన్నివేశాల పేరిట బూతు సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ బూతు సన్నివేశాలకు తోడు వయాగ్రా గురించి కూడా ఇరికించారు. పేరుకి హీరో హీరోయిన్ ల మధ్య శృంగారం కానీ అంతకుమించి అన్నట్లుగా సాగింది ఈ వ్యవహారం.

టీజర్ లోనే ఇంతగా శృంగారం ఉంటే ఇక ట్రైలర్ లో అలాగే సినిమాలో ఎంతగా బూతు సన్నివేశాలు ఉండనున్నాయో అన్న అనుమానం రాకమానదు. ఇక ఇలాంటి సినిమాలు ఖర్చు పెట్టి మరీ రిచ్ గా తీయరు అందుకే నాసిరకంగా ఉంటాయి. యువత బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి బూతు చిత్రాలను చేస్తుంటారు కొంతమంది దర్శక నిర్మాతలు. అయితే ఈ కిస్ చిత్రంలో హీరోయిన్ ఎక్కడ కూడా సిగ్గుపడకుండా బాగానే నటించింది.