డిమాండ్ ఉంది కాబట్టే ఇస్తున్నారంటున్న రష్మిక

Published on Feb 06,2020 09:49 PM

నాకు డిమాండ్ ఉంది కాబట్టే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారని ఇందులో వింతేమీ లేదని గడుసుగా సమాధానం చెబుతోంది కన్నడ భామ రష్మిక మందన్న. బెంగుళూర్ భామ అయిన రష్మిక మందన్న కు తెలుగులో ఛలో చిత్రంతో మంచి బ్రేక్ దక్కింది. ఛలో సూపర్ హిట్ కావడంతో రష్మిక మందన్న కు డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత నటించిన గీత గోవిందం అలాగే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో ఊహించని రేంజ్ కు చేరింది అమ్మడి ఇమేజ్.

దాంతో 50 లక్షల నుండి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది ఈ భామ. ఇక మహేష్ సరసన నటించి ప్రమోషన్ కొట్టిన ఈ భామ తాజాగా ఎన్టీఆర్ , అల్లు అర్జున్ చిత్రాల్లో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. మాకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే అధిక రెమ్యునరేషన్ ఇస్తారని అంతేకాని డిమాండ్ లేనప్పుడు ఇవ్వరు కదా ! అంటూ కొంటె సమాధానం చెబుతోంది ఈ కన్నడ భామ.