విజయ్ ని రిజెక్ట్ చేసిన రష్మిక మందన్న

Published on Sep 07,2019 02:35 PM

ఇదేంటి హెడ్డింగ్ చూసి రష్మిక మందన్న విజయ్ ని రిజెక్ట్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మీరు విన్నది నిజమే ! రష్మిక మందన్న విజయ్ ని రిజెక్ట్ చేసింది కానీ ఆ హీరో విజయ్ దేవరకొండ కాదు తమిళ స్టార్ హీరో విజయ్. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అయితే అంతటి స్టార్ హీరో సరసన రష్మిక కు ఛాన్స్ వస్తే మొహమాటం లేకుండా నో చెప్పిందట .
 దాంతో ఇదొక సంచలనం అయ్యింది, ఇంతకీ  అసలు విషయం ఏంటంటే ....... విజయ్ తో చేయడానికి ఒప్పుకునేదేనట కానీ అదే సమయంలో హిందీలో ఛాన్స్ వచ్చిందట ఈ భామకు దాంతో హిందీలో చేస్తే ఆ రేంజ్ వేరు కదా అందుకే విజయ్ సినిమాకు నో చెప్పి హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట దాంతో రష్మిక మందన్న ని తీసుకోవాలని అనుకున్న పాత్రలో కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారట.