బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న

Published on Sep 04,2019 10:20 AM

కన్నడ భామ రష్మిక మందన్న బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్. ఇక ఈ చిత్రంలో హీరోగా కబీర్ సింగ్ తో ఇటీవలే బ్లాక్ బస్టర్ కొట్టిన షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా అతడి సరసన రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ దాదాపుగా నిర్ణయించుకున్నాడట కరణ్ జోహార్. 
డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూసిన కరణ్ రష్మిక మందన్న పై మనసు పారేసుకున్నాడు దాంతో జెర్సీ రీమేక్ లో ఆమెని సెట్ చేయబోతున్నాడు. తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న రష్మిక అల్లు అర్జున్ చిత్రంలో కూడా నటించనుంది. ఇక ఇప్పుడు జెర్సీ రీమేక్ తో బాలీవుడ్ బాట పట్టి అక్కడ కూడా హిట్ కొడితే ఈ భామ మరింత క్రేజీ భామ కావడం ఖాయం.