దిల్ రాజు కు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న

Published on Oct 21,2019 05:25 PM

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఛాన్స్ వస్తే ఎంతటి హీరోయిన్ అయినా టక్కున ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు కానీ కన్నడ భామ  రష్మిక మందన్న మాత్రం దిల్ రాజు కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు డబుల్ ఇస్తే కానీ మీ సినిమా చేయను అంటూ తేల్చి చెప్పిందట దాంతో దిల్ రాజు కి ఎక్కడో కాలింది అంతే రష్మిక మందన్న స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ ప్లాప్ అయ్యింది అయినా కూడా తన రేటుని 50 లక్షల నుండి కోటి రూపాయలకు పెంచిందట ఈ భామ. అసలే హిట్ లేదు ఆపై రెమ్యునరేషన్ పెంచడం ఏంటి ? అని మండిపడుతున్నారట దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది అందుకని కాబోలు రెమ్యునరేషన్ పెంచింది.