మహేష్ సరసన రష్మీక మందన్న

Published on Mar 06,2019 03:25 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన  కన్నడ భామ రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. మహర్షి చిత్రం తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా రష్మిక మందన్న ని తీసుకోవాలని చూస్తున్నారట. 

ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రష్మిక మందన్న . ఆ సినిమా మంచి హిట్ కావడంతో గీత గోవిందం చిత్రంలో నటించే ఛాన్స్ లభించింది. గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగునాట రష్మిక మందన్న కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఇప్పుడేమో ఏకంగా మహేష్ బాబు సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తోంది.