రష్మిక మందన్నతో రొమాన్స్ చేయనున్న అల్లు అర్జున్

Published on Apr 08,2019 10:31 AM

రష్మిక మందన్న తో రొమాన్స్ చేయడానికి ఉత్సాహపడుతున్నాడు అల్లు అర్జున్ . ఛలో చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది కన్నడ భామ రష్మిక మందన్న . ఛలో సక్సెస్ తో గీత గోవిందం లాంటి బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది దాంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . తాజాగా అల్లు అర్జున్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ లభించింది రష్మిక కు . 

అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేసారు . మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు తర్వాత ప్రారంభం కానుంది . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది నుండి జరుగనుంది ఈ చిత్రం . 

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించగా ఆ సినిమా మే 31 న రిలీజ్ కానుంది . మీడియం రేంజ్ హీరోల సరసన నటిస్తున్న రష్మిక కు అల్లు అర్జున్ ప్రమోషన్ కల్పిస్తున్నాడు ఇక ఆ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే రష్మిక మందన్న .