నితిన్ ని మంకీ తో పోల్చిన రష్మిక మందన్న

Published on Dec 02,2019 01:29 PM

హీరో నితిన్ ని మంకీ తో పోల్చింది రష్మిక మందన్న. తాజాగా నితిన్ - రష్మిక మందన్న జంటగా '' భీష్మ '' అనే చిత్రంలో నటిస్తున్నారు. భీష్మ అనే టైటిల్ పెట్టినప్పటికీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా నితిన్ క్యారెక్టర్ ఉండనుంది. అమ్మాయిల వెంట పడే కోతి పిల్లాడు నితిన్ అన్నమాట. దాంతో రష్మిక మందన్న తన ఫోటోని ఒకటి షేర్ చేసి నితిన్ ని మంకీ గా పేర్కొంది. అయితే ఎక్కడా నితిన్ పేరు ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం ఈ భామ నితిన్ తో భీష్మ అనే చిత్రం చేస్తోంది కాబట్టి అదే అని అనుకోవాలి.

ఇక భీష్మ చిత్రంతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం కూడా చేస్తోంది. మొదటిసారిగా సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ లభించింది ఈ భామకు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తన రేంజ్ మరింతగా పెరుగుతుందని భావిస్తోంది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న భారీ ఎత్తున విడుదల కానుంది.