విజయ్ దేవరకొండ మీద కోపంగా ఉన్న రష్మిక

Published on Aug 26,2019 02:44 PM
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ మీద విపరీతమైన కోపం వచ్చింది దాంతో అతడికో దండం ఇక మరో రెండేళ్ల పాటు అతడితో కలిసి నటించేది లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా గీత గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అయితే గీత గోవిందం పెద్ద హిట్ కాగా డియర్ కామ్రేడ్ చిత్రం మాత్రం ప్లాప్ అయ్యింది. 

రిజల్ట్ సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ల మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దాంతో ఇకపై కలిసి మళ్ళీ సినిమా చేయాలనుకోవడం లేదు ఇప్పట్లో. ఇక కన్నడనాట అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. విజయ్ దేవరకొండ మీద రష్మిక మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు కన్నడ ప్రేక్షకులు. అందుకే రెండేళ్ల పాటు మళ్ళీ సినిమా చేయాలనీ అనుకోవడం లేదట ఈ ఇద్దరు .