కన్నీళ్ల పర్యంతం అయిన యాంకర్ రష్మీ

Published on Apr 02,2020 03:53 PM
యాంకర్ రష్మీ కన్నీళ్ల పర్యంతం అయ్యింది దాంతో షాక్ అవ్వడం నెటిజన్ల వంతయ్యింది. అందాల ఆరబోతతో సంచలనం సృష్టించే ఈ భామ తాజాగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న ఈ సమయంలో పేద ప్రజలు తిండిలేక అల్లాడిపోతున్నారని అలాంటి వాళ్ళను ఆదుకోవాలని ప్రజలను కోరింది అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో మూగ జీవాలు , కుక్కలు తిండిలేక చచ్చిపోతున్నాయని కన్నీళ్ల పర్యంతం అయ్యింది.

కొంతమంది పేద ప్రజలు , వలస కూలీలు అలాగే మూగ జీవాలు ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారని అలాంటి వాళ్ళకు చేతనైనంత సహాయం ప్రతీ ఒక్కరు చేయాలనీ కోరుతోంది రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన సందర్బంగా ఇలా కన్నీళ్ల పర్యంతం అయి నెటిజన్లకు షాక్ ఇచ్చింది.