విద్యాబాలన్ పై అత్యాచారానికి పూనుకున్నారట

Published on Aug 30,2019 11:05 AM

విద్యాబాలన్ పై ఓ తమిళ దర్శకుడు అత్యాచారానికి ట్రై చేసాడట ! అయితే విద్యాబాలన్ ఎదురు తిరగడంతో తోక ముడిచాడట ! ఈ సంచలన విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చింది విద్యాబాలన్. అయితే ఈ సంఘటన జరిగింది ఇప్పుడు కాదట కెరీర్ తొలినాళ్లలో తమిళ చిత్రాల్లో నటించాలని ఇక్కడికి వచ్చినప్పుడు ఓ దర్శకుడు కథ చెబుతానని హోటల్ గదికి తీసుకెళ్లాడట. 
అక్కడ గది తలుపులు మూయబోతుండగా ఎదురుతిరిగిందట దాంతో పలాయనం చిత్తగించాడట తమిళ దర్శకుడు. అలాగే ఓ తమిళ నిర్మాత కూడా ఓ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి వెధవ వేషాలు వేసాడట ఇంకేముంది ఉగ్ర రూపం చూపించిందంట విద్యాబాలన్ దాంతో తన కోరిక నెరవేర్చలేదనే సాకుతో ఆ సినిమాలోంచి తీసేశాడట. అంటే సినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుండో ఉంది , ఇప్పటికి ఉంది అని చెబుతోంది విద్యాబాలన్.