శృంగార సన్నివేశం కట్ చేశారట

Published on Feb 13,2019 04:36 PM

రణ్ వీర్ సింగ్ - అలియా భట్ ల మధ్య వచ్చే శృంగార సన్నివేశాన్ని తొలగించారట కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు . దాంతో గల్లీ బాయ్ చిత్ర బృందం షాక్ అయ్యింది . ప్రేమికుల దినోత్సవం సందర్బంగా రేపు రిలీజ్ కానున్నది గల్లీ బాయ్ చిత్రం . అయితే ట్రైలర్ లో ఉన్న లిప్ లాక్ సీన్ నిడివి ఎక్కువగా ఉందని కట్ చేశారట సెన్సార్ సభ్యులు . 

అలియా భట్ - రణ్ వీర్ సింగ్ ల లిప్ లాక్ యువతని విపరీతంగా ఆకర్షిస్తోంది అయితే నిడివి ఎక్కువ కావడంతో అంతొద్దు అంటూ లిప్ లాక్ ని లాక్ చేశారట . దాంతో యువతకు కావాల్సిన మసాలా కొద్దిగా మిస్ కానుంది . లిప్ లాక్ మాత్రమే కాదు కొన్ని బూతు డైలాగ్స్ ఉండగా వాటిని కూడా మ్యూట్ చేయమని చెప్పారట సెన్సార్ సభ్యులు . ఇటీవలే సింబా తో బ్లాక్ బస్టర్ అందుకున్న రణ్ వీర్ సింగ్ కు గల్లీ బాయ్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో రేపు తేలనుంది .